Tuesday 29 October 2013

స్నేహం పేరు తో మోసం చేస్తారు జాగ్రత్త

స్నేహం పేరు తో మన టైం ని డబ్బు ని హరించే మనుషులు వుంటారు. వాళ్ళతో జాగ్రత్త గా ఉండాలి లేదంటే మన గొయ్య మనం తీసుకునట్టే. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను ఒక software ఉద్యోగస్తుడు. రోజు ఆఫీసు ఇల్లు తప్ప అతనకి వేరే ధ్యాస లేదు. ఒక రోజు అతనకి Facebook లో ఒక అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. అది చూసి చాల మురిసిపోయాడు. తనకి కూడా అమ్మాయిలు రిక్వెస్ట్ పంపిస్తారా అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యం తో పాటు కొంచెం గర్వం గా కూడా feel అయ్యాడు. ఏమైతే ఏమి ఆ అమ్మాయి ని add చేశాడు. ఇంకేముంది మొబైల్ నంబర్స్ exchange చేసుకున్నారు. కలుసుకున్నారు. సినిమాలు కి షికార్లు కి తీరిగారు. ఇక మనవాడు hero లాగ ఫీల్ అయ్యేవాడు .

Sunday వస్తే చాలు ఆ అమ్మాయి ని ఎలా కలవాలి అని plans వేసేవాడు. ఆ అమ్మాయి కి money అవసరం వస్తే ముందు వెనక ఆలోచించకుండా ఆదుకున్నాడు. ఇక మనవడు అమ్మాయి మాయ లో పడిపోయాడు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఆ అమ్మాయే. ఆ అమ్మాయి మాటలు కి చూపులు కి బోర్ల పడ్డాడు.

ఒక రోజు ధైర్యం చేసి తను ప్రేమిస్తున్న విషయం చెప్పాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు కానీ friend గా అయతే వుంటాను అని చెప్పింది. మనోడు మల్లి plan వేసాడు. ఫ్రెండ్ గా ఉంటూ నెమ్మది గా అమ్మాయి మనసు గెలవచ్చు  అనుకున్నాడు. కానీ అక్కడ అంత scene లేదు. మల్లి క్లోజ్ అయ్యారు. మల్లి టైం చూసుకొని propose చేసాడు. అమ్మాయి ఒప్పుకోలేదు. మల్లి ఫ్రెండ్ అన్నాడు , మల్లి క్లోజ్ అయ్యారు . ఇక మల్లి proposal తీసుకొచ్చాడు. కాని ఒప్పుకోలేదు. తర్వాత ఇద్దరు విడిపోయారు.

ఆ అమ్మాయి ని వాళ్ళ ఫ్యామిలీ  ఫ్రెండ్ అబ్బాయి propose చేస్తే ఇంట్లో మాట్లాడు అని చెప్పింది. So రెండు కుటుంబాలు convince అయ్యారు. ఎందుకు కన్విన్సు అయ్యారు అంటే 'same caste. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు.

Moral ( నీతి ) : మొదటి సారి propose చేసాక విడిపోవడం సహజం. కాని 3 times వరకు ఆ అమ్మాయి విడిపోలేదు అంటే ఏంటి అర్ధం. ఆ అమ్మాయి కి అతని  తో అవసరం ఉంది. అతని లో వున్న talent అమ్మాయి కి బాగా తెలుసు. మనకి అవసరం కి ఉపయోగపడతాడు అనే ఒకే ఒక్క కారణం తో friends గా వుందం అని చెప్పింది. అమ్మాయి కి 'కుల పిచ్చి' మెండు గా  ఉంది. అవసరం కోసం కులాన్ని పట్టించుకోలేదు కానీ కలిసి బ్రతకడానికి మాత్రం కులం కావాలి. ఎంత దారుణం. నువ్వు తినకపోతే నేను తినను ఇలాంటివి ఎందుకు చెయ్యాలి.  అతను వద్దు అనుకుంటే ముందే దూరం గా ఉంచాలి కానీ తన ని ఆశలు కల్పించడం ఎంత వరకు correct.

Boys కి message : అమ్మాయలు అందం చూసి పడిపోకండి. వాళ్ళు నవ్వితే అప్సరసలు లాగా వుంటారు అని అనుకోకండి. వాళ్ళ మాటలు విని మీరు మోసపోకండి. Money and time ని waste చెయ్యకండి. ముందు మీరు career గురించి think చెయ్యండి. Success అయ్యాక అప్పుడు ఆలోచించండి , మీకే అర్ధం అవుతాది. అమ్మాయి ఎలాంటిదో ముందు analyze చెయ్యాలి. అలా అని అందరు అమ్మాయలు చెడ్డ వాళ్ళు కాదు. So బాగా think చెయ్యండి.

అలాగే అమ్మాయలు ని కొంత మంది అబ్బాయలు విసిగిస్తుంటారు and torture కూడా పెడతారు. ఇది తప్పు. మనకి అమ్మ, అక్క, చెల్లి, cousins ఉంటారు కదా. వాళ్ళని ఎవరైన tease చేస్తే ఊరుకుంటారా? So అమ్మాయి బట్టి move అవాలి.

Girls కి message : అబ్బాయలు చూడటానికి rough గా ఉంటారు కానీ మనసు చాలా sensitive. So ఇష్టం ఉంటే direct గా చెప్పండి లేదంటే మనం విడిపోదాం అని చెప్పండి. అంతే తప్ప friend  గా ఉందాం అని చెప్పకండి. Girls emotions and situations ని handle చెయ్యగలరు but boys చెయ్యలేరు. Love చేస్తున్న అబ్బాయి friend గా వుండటం కుదరదు.

అందరకి message : అమ్మాయలు అబ్బాయలు ఫ్రెండ్స్ గా ఉండచ్చు, తప్పు లేదు కాని ప్రేమిస్తే ఎలా ఉంటుందో మా friend  స్టొరీ చెప్పాను. ముందు మీ goal ని ప్రేమించండి. Love and infatuation మాయ లో పడి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. I wish you great success.

మీరు ఏమైనా  చెప్పాలి అనుకుంటే comment రాయండి.

Wednesday 9 October 2013

నిజమైన స్నేహం లో స్వార్ధానికి చోటు లేదు

నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. ఐఏఎస్ ఆఫీసర్ అవాలని అతని కోరిక. కోరిక కు తగినట్టే అతను పగలు రాత్రి తేడా లేకుండా చదివేవాడు. రోజు క్రమం తప్పకుండా గ్రంధాలయం కి వెళ్ళేవాడు. సమయం చిక్కినపుడు నన్ను కలిసేవాడు. మేము అన్ని విషయాలు మీద సమగ్రం గా చర్చించుకునేవాళ్ళం. సినిమాలు దగ్గర నుంచి దేశం లో రాజకీయం వరకు అన్ని అంశాలు మా  కబుర్లు లో భాగం గా ఉండేవి. అతను చాలా తెలివైన వ్యక్తి. ఏ విషయాన్నీ అయన లోతు గా ఆలోచించి మాట్లాడటం అతని నైజం. మనిషి అలా వుండాలి ఇలా వుండాలి అని చెప్పేవాడు. 

అలా కొన్ని రోజులు గడిచాక ఒక రోజు నేను బట్టలు షాప్ కి తోడు వస్తారా అని ఫోన్ చేసి అడిగాను. నాకు పని వుంది చదువుకోవాలి అని చెప్పాడు.  సరే చదువుకుంటున్న అతన్ని ఇబ్బంది పెట్టడం సంస్కారం కాదు అని నేనే స్వయం గా  షాప్ కి వెళ్ళాను. మరుసటి రోజు మేము సాయంత్రం కలిసాం. ముందు రోజు సాయంత్రం కంప్యూటర్ లో సినిమా చూసాను అని చెప్పాడు. నేను కొంచెం బాధ పడ్డాను. చదువుకోవాలి అని చెప్పే బదులు సినిమా చూస్తున్నాను అని చెప్తే ఏమవుతాది అని ఆలోచించాను. 

ఒక రోజు అతని ఇంటర్నెట్ పని చెయ్యకపోతే నాకు ఫోన్ చేసి మీరు వెళ్లి నా బదులు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడు . సరే నా స్నేహితుడే కదా అని చేశాను . ఇలా వారం కి ఒక సరి అయన ఫోన్ చేసి ఆ సహాయం చెయ్యండి ఈ సహాయం చెయ్యండి అని అడిగెవాడు. ఇలా చాల సార్లు జరిగింది. అయతే నాకు ఏ అవసరం వచ్చిన అతను ఒక సరి కూడా సహాయం చెయ్యలేదు. మొహమాటం లేకుండా కుదరదు అని చెప్పేవాడు. 

అందుకే స్నేహితుల్లారా ఇలాంటి వాళ్ళు మన చుట్టూ వుంటారు. జాగ్రత్త గా లేకపోతే మనల్ని చెరుకు ని మెషిన్ లో పెట్టి రసం పిండినట్టు పిండేస్తారు. నిజమైన స్నేహం అంటే ఏమి ఆశించకోడదు అని మీరు అనుకోవచు. నిజమే కానీ ఇచ్చి పుచ్చుకుంటే ఎవరకి ఇబ్బంది వుండదు. స్నేహాన్ని అడ్డుపెట్టుకొని స్వార్ధ ప్రయోజనాలు పొందాలి అనుకోవడం తప్పు . ఎవరు మంచి స్నేహితులో గుర్తించి స్నేహం చెయ్యండి. ఆ స్నేహమా కలకాలం నిలవాలి. 

మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ ఈ క్రింద బాక్స్ లో రాయగలరు.

Tuesday 8 October 2013

పరిచయం

ఎందరో మహానభావులు . అందరకి వందనాలు

ఈ బ్లాగ్ మొదలుపెట్టడానికి ముఖ్య ఉదేశ్యం మన సమాజం లో నిత్యం చూస్తున్న విషయాలు, పరిస్థితులు, ఘటనలు ని నా కోణం తో పాఠకులు కి చూపించాలి అనుకోవడమే. 

మీలో కొంత మంది ఒత్సాహికులు 'వీడెవడు రా బాబు ప్రతి రోజు న్యూస్ చానెల్స్ 24 గంటలు ఇవే విషయాలు మీద గంటలు తరబడి ప్రసారం చేస్తుంటే మల్లి సమజం , విషయలు, అది ఇది అని మాట్లాడతాడు ఏంటి అని అనుకోవచ్చు'. అనుకోవడం లో తప్పు లేదు కానీ నేను మీ నుంచి లాభం ఆశించి ఈ బ్లాగ్ రాయటం లేదు . నాకు వున్నా అనుభవాలు ని నేను చుసిన ప్రపంచాన్ని విశ్లేషించి మీ ముందు పెడతాను. అందుకే ఈ బ్లాగ్ పేరు 'కనువిప్పు ' అని పెట్టడం జరిగింది. నా ఆలోచనలు ని మీరు ఏకాభివించి అభినందిస్తే చాలు. నా జన్మ ధన్యం అయంది అని అనుకుంటాను. 

నేను సమాజం గురించి మాత్రమే మాట్లాడతాను అనుకోకండి. అన్ని భిన్నమైన విషయాల్ని చర్చిస్తాను. ఇక నా విషయానికి వస్తే నేను జర్నలిస్ట్ ని కాదు, రాజకీయ నాయకుడ్ని కాదు, కధల రచయత కాదు. 127 కోట్ల జనాభా గల మన దేశం లో ఒక సామాన్య మానవుడ్ని. 

నా తెలుగు భాష లో లోపాలు వున్నా లేక అచ్చు తప్పులు వున్నా నన్ను క్షమిస్తారు అని ఆశిస్తున్నాను.  తప్పులు దొర్లినచో తెలుగు పండితులు నన్ను దండించాలి అని నా ప్రార్థన.  ఈ బ్లాగ్ ద్వారా మీ అందరకి దగ్గర అవుతునందుకు సంతోషం గా ఉంది.

రాబోయే బ్లాగ్ పోస్ట్ తో మిమ్మల్నిపలకరిస్తాను.